AP CM: రేషన్ కార్డుదారులకు తీపి కబురు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Ration Card: రేషన్ కార్డు ఉన్న వారికి మరో శుభవార్త
చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు చౌక ధరల దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే
పంపిణి చేస్తున్న ప్రభుత్వాల కంటే ధీటుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇప్పుడు నిత్యవసరాలను కూడా అందించే
కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ
ప్రభుత్వం పేద ప్రజల కోసం ఈతరహా సౌకర్యాన్ని అందించబోతోంది.
రేషన్ కార్డు ఉన్న వారికి మరో శుభవార్త
చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు చౌక ధరల దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే
పంపిణి చేస్తున్న ప్రభుత్వాల కంటే ధీటుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇప్పుడు నిత్యవసరాలను కూడా అందించే
కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ
ప్రభుత్వం పేద ప్రజల కోసం ఈతరహా సౌకర్యాన్ని అందించబోతోంది.
రేషన్ కార్డులు ఉన్న వారికి జులై
నుంచి బియ్యం,చెక్కరతో పాటు కంది పప్పు కూడా
ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం. దీనికి తోడుగా ఏపీ గవర్నమెంట్ మరో తీపి
కబురు చెప్పింది. బియ్యానికి బదులుగా మూడు కేజీల రాగులు పంపిణి చేస్తామని
ప్రకటించింది.
బియ్యంతో పోలిస్తే రాగులు బలవర్దమైన
ఆహార పదార్ధాలుగా తింటుంటారు. ప్రస్తుతం మార్కెట్లో రాగులకు డిమాండ్ కూడా భారీగా
ఉంది. షుగర్, బీపీ బాధితులకు ఇది చాలా ఆరోగ్యకరమైనది
కావడంతో ప్రభుత్వం బియ్యం స్థానంలో మూడు కేజీల రాగులను సప్లై చేస్తుంది.
ఇకపై రేషన్ కార్డుదారులకు బియ్యంతో
పాటు కంది పప్పు, చక్కెర వంటివి పంపిణీ చేస్తామని ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు.అలాగే రాగులు కూడా వచ్చే నెల అంటే జులై
ఫస్ట్ నుంచి రాయలసీమలోని 8 జిల్లాల్లోల రాగులను పంపిణి చేస్తామని పౌరసరఫరాలశాఖ
తెలిపింది.
ప్రస్తుతం రాయలసీమలో సప్లై చేస్తున్న ఈ
రాగుల పంపిణిని వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లాలకు
విస్తరింపజేయలని సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ ప్రకటించింది.
జులై నుంచి శ్రీసత్యసాయి పుట్టపర్తి
జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేషన్ కార్డుదారులకు జొన్నలను కూడా పంపిణి
చేయనున్నారు. రాగులు, జొన్నలు లేని వారు పూర్తిగా బియ్యం
పొందవచ్చు అని కూడా ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది.
పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
రేషన్ సరుకులు నిల్వ చేసిన గోదాములో తనిఖీ చేశారు. కొన్ని అవకతవకలు ఉన్నట్లు
ఆయన గమనించారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.పంచదార, కందిపప్పు, నూనె వంటివి ప్యాకెట్‌కు 50 నుంచి 100 గ్రాములు తక్కువ బరువు ఉన్నట్లు ఆయన
గుర్తించారు.
రెండింటి అనుసంధానానికి చాలా గడువు
లభించింది.ప్రభుత్వం మరో మూడు నెలలు ఈ గడువు పొడిగించింది. అంటే సెప్టెంబర్ చివరి
వరకు మీరు ఆధార్ రేషన్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు. అంటే ఇకేవైసీ
చేసుకోకపోయినా కూడా మీ రేషన్ కార్డులు రద్దు కావు. చెల్లుబాటు అవుతూనే ఉంటాయని
గుర్తించుకోవాలి.అయితే గడువు దగ్గర పడే వరకు వేచి చూడకుండా.. వెంటనే ఇకేవైసీ
పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేదంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. రేషన్
కార్డు చెల్లుబాటు కాకుండా పోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
Comments
Post a Comment